Mani Shankar Aiyar: పాకిస్థాన్‌ను గౌరవించండి.. ఆ దేశం వద్ద అణుబాంబు ఉన్నది: మణిశంకర్ అయ్యర్
Mani Shankar Aiyar: పాకిస్థాన్‌ను గౌరవించాలని.. ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నట్లు మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు చెందిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్తు చేశారు. కాంగ్రెస్ ఐడియాలజీని ఆయన తప్పుపట్టారు.
న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్(Mani Shankar Aiyar)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌తో చర్చలు నిర్వహించాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. పాకిస్థాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయని, ఒకవేళ మన ప్రభుత్వాలు ఆ దేశాన్ని సతాయిస్తే, అప్పుడు ఆ దేశం మనపై బాంబులు వేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన మణిశంకర్ అయ్యర్ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. పాకిస్థాన్‌ను మనం గౌరవించాలని, ఎందుకంటే ఆ దేశం వద్ద బాంబు ఉందని, వాళ్లకు మన మర్యాద ఇవ్వకుంటే, వాళ్లు మనపై అణుబాంబును వాడే అవకాశం ఉన్నట్లు అయ్యర్ వెల్లడించారు.
పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని, కానీ మనవాళ్లు మిలిటరీని వాడుతున్నారని, దీని వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, వాళ్ల దగ్గర బాంబులు ఉన్నాయని, ఓ పిచ్చోడు బాంబులు వేయాలనుకుంటే ఏమవుతుందో తెలుసా అని ఆయన అన్నారు. బాంబు మన దగ్గరా ఉన్నాయని, ఒకవేళ లాహోర్‌పై బాంబు పడితే, దాని రేడియేషన్ 8 సెకన్లలో అమృత్సర్ చేరుతుందన్నారు.
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఇది కాంగ్రెస్ ఐడియాలజీని ప్రతిబింబిస్తుందని బీజేపీ ఆరోపించింది. అయ్యర్ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. పాకిస్థాన్‌కు సపోర్టు పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ అని ఆయన విమర్శించారు. సియాచిన్‌ను వదిలేసుకునేందుకు ఆ పార్టీ సిద్దమైందన్నారు. ప్రజల్ని విభజించి, అబద్దాలు చెప్పి, ఫేక్ గ్యారెంటీలు ఇస్తున్నారని, పేదలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదుల్ని తరిమికొడుతామని ఇటీవల ప్రధాని మోదీతో పాటు ఇతర నేతలు అనడంతో మణిశంకర్ అయ్యర్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.
Rahuls Cong “idealogy” is fully visible in these elections
➡️Support to and from Pakistan incldg offrng to give up Siachen
➡️ Support to and from domestic terror-linked organizations and people like SDPI, Yasin Malik
➡️ Rampant Corruption and loot of money meant for poor… pic.twitter.com/UABONLzNFN— Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam) (@Rajeev_GoI) May 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- atom bomb
- BJP
- congress party
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

