Chandu Champion | గూస్బంప్స్ తెప్పిస్తున్న కార్తీక్ ఆర్యన్ ‘చందూ ఛాంపియన్’ ట్రైలర్
Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేసింది.
ఈ ట్రైలర్ గమనిస్తే.. భారతదేశం నుంచి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ట్రైలర్లో కార్తీక్ ఆర్యన్ రెజ్లర్ లుక్‌లో అదరగొడుతున్నాడు. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తుండగా.. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ మీరు చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

