JEE Main | జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. టాప్‌లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 (JEE Main) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.
న్యూఢిల్లీ: బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 (JEE Main) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి కూడా ఉన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఏప్రిల్ 12న జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్షను దేశవ్యాప్తంగా 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. బీఆర్క్ పరీక్షకు 36,707 మంది, బీప్లానింగ్ పరీక్షకు 16,228 మంది విద్యార్థులు హాజరయ్యారు. 73,362 మంది విద్యార్థులు బీఆర్క్‌కు, 38,105 మంది బీప్లానింగ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు.
కాగా, బీఆర్క్ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన బసాక్, తమిళనాడు విద్యార్థి ముత్తు 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఏపీకి చెందిన యాయవరం శ్రవణ్ రామ్, తెలంగాణ విద్యార్థులు వివేక్‌జిత్ దాస్, బోడ ప్రభంజన్ జాదవ్, బానోత్ రిత్వక్ 99 పర్సంటైల్ స్కోర్ చేశారు. అదేవిధంగా బీప్లాన్‌లో అరుణ్ రాధాక్రిష్ణ (కర్ణాటక), కలసాని సాకేత్ ప్రణవ్ (ఏపీ) 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థి కాలిగాట్ల దేవీప్రసాద్ 99.99 పర్సంటైల్ సాధించాడు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

