Terrorist Attacks | కశ్మీర్లో ఉగ్రదాడి.. బీజేపీ మాజీ సర్పంచ్ మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్‌నాగ్, షోపియాన్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్‌నాగ్, షోపియాన్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో షోపియాన్‌లోని హిర్పోరా ప్రాంతంలో మాజీ సర్పంచ్, బీజేపీ నాయకుడు ఐజాజ్ షేఖ్‌ను కాల్చివేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతు అతడు మృతిచెందారు.
అరగంట వ్యవధిలోనే అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం వద్ద పర్యటకుల శిబిరంపై కాల్పులు జరిపారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఓ జంట గాయపడ్డారు. యన్నర్‌లోని పర్యాటకుల రిసార్టు వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తబ్రేజ్, ఫర్హాగా గుర్తించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్, షోపియాన్‌లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | J&K: Visuals from outside the residence of BJP leader and ex-Sarpanch Aijaz Ahmad Sheikh, who was shot dead by terrorists yesterday in Heerpora, Shopian. https://t.co/GF4LTK64r4 pic.twitter.com/6OHuDr3U0q
— ANI (@ANI) May 19, 2024
కాగా, ఐదో దశ ఎన్నికలకు ముందు వరుస ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం బారాముల్లా జిల్లాలో పోలింగ్ జరుగనుంది. అనంత్‌నాగ్‌లోని రాజౌరీ లోక్‌సభ స్థానానికి మాత్రం మే 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా, కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో వాయిదా పడింది. ఆ పోలింగ్‌ను మే 25వ తేదీకి వాయిదా పడింది. మరోవైపు ఈ ఘటనను బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఖండించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

