నేడు హైదరాబాద్లో నేతన్నల భారీ ధర్నా
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
- టీపీవీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్
- సిరిసిల్లలో ఐదో రోజుకు చేరిన రిలే దీక్షలు
రాజన్న సిరిసిల్ల, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శనివారం చలో హైదరాబాద్ పేరిట ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్మికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న నేతన్నల రిలే దీక్షలు శుక్రవారానికి ఐదు రోజుకు చేరుకున్నది.
మూషం రమేశ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ బతుకమ్మ చీరలు, యూనిఫారాలు, పండుగ దుస్తుల ఆర్డర్లు నిలిపివేసి, మరమగ్గాలకు ఇచ్చే రాయితీని ఎత్తేసి కార్మికుల కడుపుకొట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేతలకు మళ్లీ పాతరోజులు వచ్చాయని, సిరిసిల్ల కాస్త ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

