విపక్ష రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
- బడ్జెట్లో వివక్షపై ప్రతిపక్ష పార్టీల ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు బడ్జెట్లో కేటాయించిన ప్యాకేజీలను చూస్తుంటే ఇది బలవంతపు బడ్జెట్‌గా కనిపిస్తున్నదని, గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదని పేర్కొన్నాయి. కేంద్ర బడ్జెట్‌పై శుక్రవారం లోక్‌సభలో చర్చ కొనసాగింది. ఆప్ ఎంపీ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ ‘హమ్ దో హమారే దో’ అనే నినాదాన్ని ప్రస్తావించారు. గత రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన ఇద్దరిని(మోదీ, అమిత్‌షాలను ఉద్దేశించి) ప్రస్తుతం ఇద్దరు(నితీశ్ కుమార్, చంద్రబాబు) నిర్దేశిస్తున్నారని అన్నారు.
ఎంఎస్పీ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభ
అటు రాజ్యసభలో ఎంఎస్పీకి చట్టబద్ధత అంశంపై విపక్ష పార్టీల సభ్యుల ఆందోళనతో సభ దద్దరిల్లింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి సంబంధించిన ప్రశ్నపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానంపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చాలా చేసిందని, ఎంఎస్పీ వ్యవస్థను బలోపేతం చేయడంపై కమిటీ పరిశీలన చేస్తున్నదని పేర్కొన్న మంత్రి.. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై పెద్దగా మాట్లాడలేదు. దీనిపై చౌహాన్ సమాధానం అసంపూర్తిగా ఉన్నదని విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాగా, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆనాడు యుద్ధంలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు పార్లమెంట్ ఉభయ సభలు నివాళులర్పించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

