కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హక్కులను సాధించేవరకు తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 16 మంది పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని సూచించారు.
- పునర్విభజన హామీలపై ఎంపీలు పోరాడాలి
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ పిలుపు
- కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా
కాజీపేట, జూలై 26: కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హక్కులను సాధించేవరకు తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 16 మంది పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల్లో వివక్ష, విభజన చట్టంలోని హామీల విస్మరణపై శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలోని హామీలను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు, విభజన చట్టంలోని హామీలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. మిత్రపక్షాలైన టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ ఎంపీల చేతుల్లో మోదీ కీలుబొమ్మగా మారి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ తెలంగాణకు రూపాయి కేటాయించలేదని మండిపడ్డా రు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడు తూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజ న విశ్వవిద్యాలయానికి కేంద్రం నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నా రు. రాష్ట్రంపై కాంగ్రెస్, బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని విమర్శించారు. నిరసనలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

