Realme GT Neo 6 | మార్కెట్లోకి రియల్మీ జీటీ నియో6.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme GT Neo 6 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ జీటీ నియో6 (Realme GT Neo 6) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme GT Neo 6 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ జీటీ నియో6 (Realme GT Neo 6) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ చిప్సెట్, 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1.5కే రిజొల్యూషన్ తోపాటు 8టీ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. త్వరలో భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
రియల్ మీ జీటీ నియో 6 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.22 వేలు (2099 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.27 వేలు (2399 చైనా యువాన్లు), 26 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.31 వేలు (2699 చైనా యువాన్లు), టాప్ హై ఎండ్ 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.35 వేలు (2999 చైనా యువాన్లు) పలుకుతుంది. క్యాన్ గే హ్యాకర్, లింగ్జీ పర్పుల్, లిక్విడ్ నైట్ రంగుల్లో లభిస్తుందీ ఫోన్.
రియల్ మీ జీటీ నియో6 ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ5 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1.5 కే రిజొల్యూషన్‌తోపాటు (1264×2780 పిక్సెల్స్) 8టీ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. 4ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. డ్యుయల్ థ్రీ డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్ విత్ 10014 ఎంఎం స్క్వేర్ వీసీ కూలింగ్ ఏరియా ఉంటది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 కెమెరా ఉంటాయి.
రియల్ మీ జీటీ నియో6 ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. జియో మ్యాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్, అండర్ స్క్రీన్ ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సిలరేషన్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, గైరోస్కోప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 120 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల రియల్ మీ జీటీ నియో6 ఫోన్ పని చేస్తుంది. పది నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ చార్జింగ్ అయ్యే టెక్నాలజీతో ఈ బ్యాటరీ పని చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

