Good Bad Ugly | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకరు అజిత్ కుమార్ (Ajith kumar). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. అజిత్ నట్తిస్తోన్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో షురూ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్లో అజిత్‌పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌తోపాటు ఓ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రంలో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండగా.. వీటిలో ఒకటి నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తవగానే అజిత్ చెన్నైకి తిరిగి వెళ్లానున్నాడట. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న Vidaa Muyarachiకు సంబంధించి భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్లో పాల్గొననుండగా.. ఈ షెడ్యూల్ జూన్‌లో ఉండబోతుందట. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహాం పేర్లు తెరపైకి రాగా.. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంది.