కారేపల్లి, సెప్టెంబర్ 24 : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆర్టీవో మెంబర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వల్లభనేని రామారావు తండ్రి గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం విశ్వనాథపల్లిలోని గురవయ్య నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ, కూరాకుల వలరాజు, వీరు నాయక్, లక్ష్మణ్ నాయక్, దేవభక్తిని కిశోర్, వెంకయ్య, శ్రీనివాసరావు, సురేశ్, వీరేందర్, రమేశ్ పాల్గొన్నారు.