Cooking | ఎగ్ కర్రీ స్పైసీగా ఉండాలంటే..
గుడ్లు: నాలుగు, టమాట గుజ్జు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు,
Cooking | కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, టమాట గుజ్జు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: పావు కప్పు, దాల్చిన చెక్క: చిన్న ముక్క, జీలకర్ర: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
గుడ్లను ఉడకబెట్టి పెంకు ఒలిచి గాట్లు పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క వేసి బాగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక టమాట గుజ్జు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి సన్నని మంటపై నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా ఉడికించిన గుడ్లు, గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి మరో నిమిషం పాటు ఉడికించి దించుకుంటే స్పైసీ ఎగ్ కర్రీ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

