Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఆంక్షలు.. హద్దులు మీరితే జైలుకే..!
Lok Sabha Polls | తెలంగాణలో ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు.
Lok Sabha Polls : తెలంగాణలో ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు.
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నప్పటికీ మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని స్పష్టంచేశారు.
13వ తేదీన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు రెండు క్యూలైన్లలో నిలబడాలని.. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్లు హెచ్చరించారు. ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధమని అన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించరాదని తెలిపారు.
‘మద్యం డ్రై డే’ను అమలు చేయాలి : సీఈవో
మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలను మూసేయాలని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టంచేశారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే అక్కడ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలన్నారు. మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సీఈవో స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

