Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ఊహించని ట్విస్ట్.. బెదిరించి కేసు పెట్టించారన్న బాధిత మహిళ
Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసు (Karnataka Sex Scandal Case)లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసు (Karnataka Sex Scandal Case)లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని బాధిత మహిళ ఒకరు ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) స్వయంగా ప్రకటించింది. కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి (H.D. Kumaraswamy) గురువారం తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ బాధితులను బెదిరిస్తోందని, తమ పార్టీపై బురదజల్లేందుకు మహిళలతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయకపోతే వ్యభిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
‘దర్యాప్తు అధికారులు బాధితుల ఇంటి వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారు. సిట్ అధికారులు బాధితులపై తప్పుడు వ్యభిచారం కేసులతో బెదిరించడం వాస్తవం కాదా? విచారణ ఇలాగే జరుగుపుతున్నారా’ అని కుమార స్వామి ప్రశ్నించారు. ‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు? వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా..?’ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి కృష్ణ బైరిగౌడను కుమార స్వామి ప్రశ్నించారు.
తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఈ సందర్భంగా కుమార స్వామి ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనన్నారు. దోషులకు శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేశారు. హెడ్డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు. తమకు అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే తాను హసన్ (Hassan) జిల్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా కుమారస్వామి వివరించారు.
Also Read..
Kantilal Bhuria | ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు.. కాంగ్రెస్ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
Kedarnath | తెరుచుకునున్న కేదార్నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
New York Doctor: 8 మంది పేషెంట్లను వేధించిన న్యూయార్క్ డాక్టర్‌కు శిక్ష
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

