Kedarnath | తెరుచుకునున్న కేదార్నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి.
Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
మరోవైపు యమునోత్రి ఆలయం కుండా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రిఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోనుంది. ఇక చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ (Ajendra Ajay) తెలిపారు.
#WATCH | Rudraprayag, Uttarakhand: Huge crowd of devotees from all over the country gather at Shri Kedarnath Dham as the temple portal opens on the occasion of Akshaya Tritiya. pic.twitter.com/q6eUbCjrLZ
— ANI (@ANI) May 10, 2024
#WATCH | Rudraprayag: On the opening of the doors of Shri Kedarnath Dham temple, Uttarakhand CM Pushkar Singh Dhami says, “I welcome all the devotees. I pray to god that you all have a happy journey and your wishes be fulfilled… you all are welcome.” pic.twitter.com/JsmXu1wpqt
— ANI (@ANI) May 10, 2024
#WATCH | Rudraprayag | Uttarakhand CM Pushkar Singh Dhami present for the darshan at the time of opening of Shri Kedarnath Dham temple doors. https://t.co/uneEJwSW4m pic.twitter.com/pkhaWY01rg
— ANI (@ANI) May 10, 2024
#WATCH | Rudraprayag, Uttarakhand: The doors of one of the twelve Jyotirlingas, Shri Kedarnath Dham open with full rituals and Vedic chanting with the chanting of ‘Har Har Mahadev’ by the devotees.
Chief Minister Pushkar Singh Dhami, along with his wife Geeta Dhami, present for… pic.twitter.com/MBRnJhxdH8
— ANI (@ANI) May 10, 2024
Rudraprayag, Uttarakhand: The doors of one of the twelve Jyotirlingas Shri Kedarnath Dham have been opened with full rituals and Vedic chanting with the echo of Har Har Mahadev by the devotees.
Chief Minister Pushkar Singh Dhami along with his wife Geeta Dhami were present for… pic.twitter.com/MrAiT33kqd
— ANI (@ANI) May 10, 2024
Also Read..
America | భారత ఎన్నికల్లో జోక్యం.. రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
Sleeping Tips | మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు?
BRS | చెక్కుచెదరని బీఆర్ఎస్ క్యాడర్.. కేసీఆర్ బస్సుయాత్రతో సమరోత్సాహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

