BJP – RSS | బీజేపీకి ఆరెస్సెస్‌తో పనిలేదు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
BJP - RSS | బీజేపీ, ఆరెస్సెస్ సంబంధాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌పై ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా తన వ్యవహారాలను తానే చక్కబెట్టుకొనే స్థాయికి బీజేపీ చేరుకొన్నదని వ్యాఖ్యానించారు.
BJP – RSS | న్యూఢిల్లీ/(స్పెషల్ టాస్క్ బ్యూరో), మే 18: బీజేపీ, ఆరెస్సెస్ సంబంధాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్‌పై ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా తన వ్యవహారాలను తానే చక్కబెట్టుకొనే స్థాయికి బీజేపీ చేరుకొన్నదని వ్యాఖ్యానించారు. ఎవరి అవసరం లేకుండానే ఇప్పుడు బీజేపీ తన కార్యకలాపాలను సొంతంగా నడుపుకొంటున్నదన్న ఆయన ఒక విధంగా ఆరెస్సెస్‌తో తమకు పనిలేదన్నట్టు పరోక్షంగా మాట్లాడారు. సైద్ధాంతిక సంస్థగా ఉన్న అరెస్సెస్ కూడా తన పని తాను చూసుకొంటున్నదని నడ్డా పేర్కొన్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు నడ్డా వెల్లడించారు.
ఆరెస్సెస్ దాని పని అది చూసుకొంటున్నది
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆరెస్సెస్‌తో బీజేపీకి ఉన్న సంబంధాలకు, ప్రస్తుతం ఉన్న సంబంధాలకు మధ్య తేడా ఏమిటని అడిగిన ప్రశ్నకు నడ్డా స్పందించారు. ‘ప్రారంభంలో మాకు (బీజేపీ) తక్కువ బలం ఉండేది. చిన్న శక్తిగా ఉండే వాళ్లం. అలాంటి సమయంలో ఆరెస్సెస్ అవసరం మాకు తప్పనిసరిగా మారింది. ఆరెస్సెస్‌పై ఆధారపడే పరిస్థితి. అయితే నేడు మేం ఎదిగాం, సొంత బలం, సామర్థ్యం సాధించాం. బీజేపీ తన కార్యకలాపాలను తానే సొంతంగా నడుపుకొనే స్థాయికి చేరింది.
ఇదే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఇప్పుడు ఆరెస్సెస్ సపోర్ట్ అవసరం లేదా? అని అడిగిన మరో ప్రశ్నకు నడ్డా సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ, ‘ఆరెస్సెస్ అనేది ఒక సాంస్కృతిక, సామాజిక, సైద్ధాంతిక సంస్థ. మా వరకు మేము (బీజేపీ) ఒక రాజకీయ పార్టీ. అలాంటప్పుడు ప్రతీ పార్టీకి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ.. ఎవరి పని వాళ్లు చేసుకొంటున్నాం’ అని నడ్డా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

