Sleeping Tips | మీరు ఏ వైపు తిరిగి పడుకుంటున్నారు?
నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో పొజిషన్లో పడుకుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటే కొందరు ఎడమవైపు, మరికొందరు కుడివైపు తిరిగి పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది. అయితే పడుకునే పొజిషన్ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.
Sleeping Tips | నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో పొజిషన్లో పడుకుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటే కొందరు ఎడమవైపు, మరికొందరు కుడివైపు తిరిగి పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది. అయితే పడుకునే పొజిషన్ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అన్నిరకాల పొజిషన్ల కంటే ఎడమవైపు తిరిగి పడుకుంటే శరీరంలో చాలా రకాల వ్యవస్థల పనితీరు బాగుంటుందని చెబుతున్నారు.
తరచుగా గుండెలో మంట, ఎసిడిటీతో బాధపడుతుంటే, నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఈ స్థితిలో జీర్ణాశయాన్ని, అన్నవాహికను కలిపే స్ఫింక్టర్కు కొంచెం కిందుగా జీర్ణాశయం ఉంటుంది. అందువల్ల ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని పదార్థాలు, యాసిడ్ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఎసిడిటీ సమస్య రాదు. కాలేయం శరీరానికి కుడి వైపు ఉంటుంది.
కాబట్టి కుడివైపు తిరిగి పడుకుంటే దీనిపై ఒత్తిడి పడుతుంది. శరీరంలోని టాక్సిన్లు కాలేయాన్ని చేరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎడమవైపు తిరిగి పడుకుంటే శరీరంలోని హానికర పదార్థాలు, టాక్సిన్లు కాలేయంపై భారం వేయకుండా నివారించవచ్చు. గుండె ఎడమవైపు భాగం ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకుని మిగిలిన శరీర భాగాలకు పంపిస్తుంది. అందువల్ల ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె పంపింగ్ సామర్థ్యం మెరుగవుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

