బెంగుళూరు: కర్నాటకలో వ్యక్తి తాను చేసుకోబోయే మైనర్ అమ్మాయి తల నరికేశాడు(Beheaded). ఎంగేజ్మెంట్ రద్దు కావడంతో అతను ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మడికేరిలో జరిగింది. 32 ఏళ్ల ప్రకాశ్ అనే వ్యక్తి.. 16 ఏళ్ల అమ్మాయితో ఎంగేజ్మెంట్కు సిద్ధమయ్యాడు. ఆ అమ్మాయి రెండు రోజుల క్రితమే పదో తరగతి పాసైంది. అయితే వాళ్ల మధ్య జరగబోయే పెళ్లి గురించి చైల్డ్ రైట్స్ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు వచ్చిన అధికారులు ఎంగేజ్మెంట్ వేడుకను అడ్డుకున్నారు. వయసు తక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు అని పేర్కొన్నారు. దీంతో రెండు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాయి. కానీ కొన్ని గంటల తర్వాత అమ్మాయి ఇంట్లోకి చొరబడ్డ ప్రకాశ్.. ఆమె పేరెంట్స్‌పై అటాక్ చేశాడు. ఇంట్లో నుంచి అమ్మాయిని బయటకు లాగేసి.. ఆమె తల నరికివేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారీ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.