Friendship Marriage: ప్రేమ, శృంగారం ఉండదు.. ఫ్రెండ్షిప్ మ్యారేజీ ఇప్పుడో కొత్త ట్రెండ్
Friendship Marriage: ప్రేమ కోసం పరితపించేది ఉండదు.. శృంగారం కోసం ఎదురుచూసేది ఉండదు.. కానీ జంట మాత్రం ఫ్రెండ్షిప్ మ్యారేజీ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే ఆ జంట.. పరస్పర అంగీకారంతో మరొకరిని కలుసుకోవచ్చు. జపాన్‌లో ఇప్పుడీ కొత్త రిలేషన్షిప్ పాపులారిటీ పొందుతోంది.
టోక్యో: జపాన్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఫ్రెండ్షిప్ మ్యారేజ్(Friendship Marriage) అనే రిలేషన్‌షిప్‌ను జపాన్ యువత ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదో రకమైన వివాహ సంబంధం. కానీ ఈ రిలేషన్లో ఎటువంటి ప్రేమ కానీ, శృంగారం కానీ ఉండదు. జపాన్ జనాభాలో సుమారు ఒక శాతం మంది ఈ కొత్త తరహా బంధాన్ని కోరుకుంటున్నట్లు కొన్ని సర్వేల ద్వారా స్పష్టమవుతోంది. భాగస్వామ్య వ్యక్తికి విలువ ఇవ్వడం, వారి ఆసక్తికి తగినట్లు నడుచుకోవడం ఈ రిలేషన్లో ముఖ్యం. సంప్రదాయ వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఇలాంటి రిలేషన్ కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది.
ఫ్రెండ్షిప్ మ్యారేజీలను నిర్వహించేందుకు కలర్స్ అనే పెద్ద ఏజెన్సీ కూడా ఉన్నది. వాళ్ల వద్ద ఉన్న డేటాను పరిశీలిస్తే, 2015 మార్చి నుంచి ఇప్పటి వరకు 500 మంది ఇలాంటి బంధాన్ని ఏర్పర్చుకున్నారు. కొందరు కొత్త ఇంట్లో ఉంటున్నారు. కొందరు పిల్లల్ని పెంచుకుంటున్నట్లు ఏజెన్సీ తెలిపింది.
ఇంతకు ఏంటీ ఫ్రెండ్షిప్ మ్యారేజీ
ఫ్రెండ్షిప్ మ్యారేజీలో ఇద్దరు భాగస్వాములు చట్టపరంగా దంపతులు. కానీ వారి మధ్య ఎటువంటి శృంగారభరిత ప్రేమ కానీ, శారీరక బంధం కానీ ఉండదు. ఈ జంటలు కలిసి జీవించవచ్చు లేదా వేర్వేరుగా ఉండవచ్చు. కృత్రిమ రీతిలో పిల్లల్ని కనేందుకు ఆ జంట నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజీ రిలేషన్లో ఉన్నవాళ్లు పరస్పర అంగీకారం ప్రకారం ఇతర వ్యక్తులతో రొమాంటిక్ రిలేషన్లో ఉండవచ్చు. ఒకేరకమైన భావాలు కలిసిన రూమ్మేట్ తరహాలో ఫ్రెండ్షిప్ మ్యారేజీ ఉంటుందని ఓ వ్యక్తి తెలిపారు.
ఈ రిలేషన్లో ఉండాలనుకునేవాళ్లు.. పెళ్లికి ముందే కలుసుకోవచ్చు. తమ మధ్య ఉన్న విషయాలను గంటల పాటు చర్చించ్చుకోవచ్చు. కలిసి భోజనం చేయాలా లేక ఖర్చులను ఎలా పంచుకోవాలన్న అంశాలను వాళ్లు మాట్లాడుకోవచ్చు. లాండ్రీ ఎలా చేయాలి, రిఫ్రిజిరేటర్కు ఎక్కడ స్థానం కల్పించాలన్న లాంటి అంశాలను కూడా వాళ్లు తీరికగా చర్చించుకోవచ్చు.
శారీరక బంధం లేకున్నా.. ఫ్రెండ్షిప్ మ్యారేజీలో ఉన్న 80 శాతం మంది దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు కలర్స్ ఏజెన్సీ పేర్కొన్నది. కొన్ని కేసుల్లో కొందరు పిల్లలు కన్నట్లు కూడా ఆ ఏజెన్సీ తెలిపింది. సగటున 32 ఏళ్లు ఉన్న వ్యక్తులు ఇలాంటి రిలేషన్‌ను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్ల ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువే ఉంటున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది. సెక్స్ పట్ల ఇష్టంలేనివాళ్లు, హోమోసెక్స్ వర్గాల్లోనూ ఫ్రెండ్షిప్ మ్యారేజీ పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

