Tecno Camon 30 | త్వరలో భారత్ మార్కెట్లోకి టెక్నో కమోన్ 30 సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Tecno Camon 30 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో కమోన్ 30 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Tecno Camon 30 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో కమోన్ 30 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఏయే ఫోన్లను ఆవిష్కరిస్తామన్న సంగతి వెల్లడించలేదు కానీ టెక్నో కమోన్ 30 సిరీస్ ఫోన్లలో టెక్నో కమోన్ 30, టెక్నో కమోన్ 30 5జీ, టెక్నో కమోన్ 30 ప్రో 5జీ, టెక్నో కమోన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు ఉంటాయని తెలుస్తున్నది. గత ఫిబ్రవరిలో గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నెలాఖరులో మార్కెట్లోకి కమోన్ 30 సిరీస్ ఫోన్లు వస్తాయని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా ప్రకటించింది.
టెక్నో కమోన్ 30 4జీ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్, టెక్నో కమోన్ 30 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్లతో రానున్నాయి. ఇక టెక్నో కమోన్ 30 ప్రో 5జీ, హై ఎండ్ టెక్నో కమోన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్లతో వస్తాయి. ఈ ఫోన్లన్నీ 70వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తాయి.
టెక్నో కమోన్ 30 4జీ, టెక్నో కమోన్ 30 5జీ ఫోన్లు డ్యుయల్ రేర్ ఫ్లాష్ యూనిట్లతోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి. టెక్నో కమోన్ 30 ప్రో 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తోపాటు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి.
టాప్ హై ఎండ్ టెక్నో కమోన్ 30 ప్రో 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మద్దతుతోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ అప్ టూ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, క్వాడ్ ఫ్లాష్ యూనిట్ తోపాటు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి. నాలుగు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

