Anil Kurmachalam | వినోద్ కుమార్ గెలువాలని ఎన్నారైలంతా కోరుకుంటున్నారు
Anil Kurmachalam | బోయినపల్లి వినోద్ కుమార్‌ను(Vinod Kumar) భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు(Parliament eletions) పంపాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలు (NRIs) కోరుకుంటున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యక్వస్ధాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
కరీంనగర్ : కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను(Vinod Kumar) భారీ మోజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు(Parliament eletions) పంపాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలు (NRIs) కోరుకుంటున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యక్వస్ధాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్లో ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
కరీంనగర్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి కీలక సందర్భంలో కేసీఆర్‌కు అండగా కరీంనగర్ నిలిచిందన్నారు. ఉద్యమకారుడిగా, మేధావిగా గతంలో ఎంపీగా వినోద్‌కుమార్ కరీంనగర్‌కు ఎంతో సేవ చేశారు. వివిధ రంగాల్లో కరీంనగర్ అభివృద్ధికి వినోద్ కృషి చేశారని, ఇలాంటి నాయకుడు పార్లమెంట్‌కు వెళ్తే యావత్ తెలంగాణ రాష్ట్రానికే మేలు జరుగుతుందన్నారు. బండి సంజయ్ గత ఐదు సంవత్సరాలుగా కరీంనగర్‌కు పైసా పని చెయ్యలేదని వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఎక్కడా పోటీలో లేదని, దాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు భారీ మెజారిటీతో వినోద్ కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో కరీంనగర్ టౌన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ శానబోయి, ప్రశాంత్ మామిడాల, వివేక్, ప్రవీణ్ పంతులు తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

