Kondapur | 48 గంటలుగా కరెంటు కట్.. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరించినా ఇవ్వని కనెక్షన్
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ విరిగిపడ్డాయి. అయితే కాలనీలో పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించిన అధికారులు.. కనెక్షన్ ఇవ్వకపోవడంతో రెండ్రోజులుగా కాలనీ అంధకారంలో ఉంటున్నది.
- అంధకారంలో పాపిరెడ్డికాలనీ
- నీళ్లు లేక.. బాత్రూమ్కు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు
Kondapur | కొండాపూర్, మే 9 : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ విరిగిపడ్డాయి. అయితే కాలనీలో పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను పునరుద్ధరించిన అధికారులు.. కనెక్షన్ ఇవ్వకపోవడంతో రెండ్రోజులుగా కాలనీ అంధకారంలో ఉంటున్నది. తారానగర్ సబ్‌స్టేషన్ అధికారులకు సమస్య విన్నవించుకున్నా.. ఎలాంటి స్పందన లేకుండాపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంతకంటే ఎక్కువగా ఈదురు గాలులు, భారీ వర్షాలు పడ్డాయని, గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించి, కరెంట్ సరఫరాను పునరుద్ధరించేవారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
బాత్రూమ్ వెళ్లేందుకు నీళ్లు లేవు
రెండు రోజులుగా పాపిరెడ్డి కాలనీలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు పడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను అధికారులు పునరుద్ధరించారు. కానీ కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో పాటు కాలనీలో విరిగిపడిన చెట్లను తొలగించడం లేదు. పిల్లలు, వృద్ధులు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బాత్రూమ్కు వెళ్లాలంటే.. నీళ్లు లేక అవస్థలుపడుతున్నారు. అధికారులకు అనేకసార్లు ఫోన్లు చేసినా.. స్పందించడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

