సిటీబ్యూరో, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): నగరంలోని పలు చోట్ల సోమవారం భారీ వర్షం పడింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కాప్రా ప్రాంతంలో అత్యధికంగా 6.9సెం.మీ వర్షపాతం నమోదుగా, కొంగరకలాన్ ప్రాంతంలో 4.7సెం.మీ, మంకాల్ పారిశ్రామిక వాడలో 4.4సెం.మీ, చాంద్రాయణగుట్టలో 4.1సెం.మీ, ఉప్పల్లోని రాజీవ్ నగర్ 4.0సెం.మీ, గచ్చిబౌలిలో 3.8సెం.మీ వర్షపాతం నమోదైంది. శివారుతోపాటు, కోర్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయయ్యాయి. భారీగా వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరడంతో వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది.