చెరువులో పడి ఇద్దరు హాస్టల్ విద్యార్థుల మృతి.. మూత్ర విసర్జనకు వెళ్లి మృత్యుఒడికి
మూత్ర విసర్జన కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది.
- జగిత్యాల జిల్లా మల్యాలలో విషాదం
జగిత్యాల, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/మల్యాల : మూత్ర విసర్జన కోసం స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది. మల్యాల పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలలోని ఒడ్డెర కాలనీలో గల సమీకృత వసతిగృహంలో ఉంటూ స్థానిక మండల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న జగన్నాథ సుశాంత్(10), ఐదోతరగతి విద్యార్థి వనం విష్ణు (11) మధ్యాహ్నం 3 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్తామని ఉపాధ్యాయుడు విఠల్ అనుమతి కోరారు.
పాఠశాలలోని మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగించుకోలేని స్థితిలో ఉండటంతో బయటకు అనుమతించారు. వెళ్లిన పిల్లలు అరగంట గడిచినా రాకపోవడంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయుడు పలు ప్రాంతాల్లో వెతికారు. కొత్తకుంట చెరువు వద్ద ఇద్దరు పిల్లల దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి గజ ఈతగాళ్లతో వెతికించారు. అరగంట తర్వాత చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

