వికారాబాద్, ఆగస్టు 3 : వికారాబాద్‌లోని గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం స్వగ్రామమైన చించల్‌పేటకు వెళ్లారు. సోమవారం ఉదయం వికారాబాద్‌లోని ఇంటికి రాగా, అప్పటికే ఇంటి తాళం పగుల గొట్టిన విషయాన్ని గమనించారు. బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా, ఓ వ్యక్తి దు స్తులు లేకుండా బెడ్‌పై పడుకుని ఉన్నాడు.
నవీన్ 100 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వచ్చి గాంధీ కాలనీకి చెందిన సెంట్రల్ మెథడిస్ట్ చర్చి యూత్ ప్రెసిడెంట్ వరుణ్‌గా గుర్తించారు. వెంటనే నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.