మన దినచర్యను సమతుల్యమైన అల్పాహారంతో ప్రారంభించడం వల్ల శరీరానికి శక్తితో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ, బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్ సిప్ చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అల్పాహారమే. ఇది శరీరానికి అవసరమైన పోషకాల పునాదిని వేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే క్లిష్టమైన మార్పులు అవసరం లేకుండా పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని అల్పాహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. ఉదయాన్నే వండుకొని తినాలంటే బద్ధకంగా ఫీలయ్యేవారికి బాదం చక్కటి అల్పాహారంగా ఉపయోగపడుంది. అల్పాహారాన్ని మరింత పోషకవంతంగా మార్చుకోవడానికి బాదం మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, మెగ్నీషియం, విటమిన్-ఇ తోపాటు మొత్తం 24 రకాల పోషకాలు ఉంటాయి. అలాగే పాలీఫెనాల్స్ జీర్ణకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్-ఇ, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సాయపడతాయి. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక ఎకువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది. అందుకే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం ఉండేలా చూసుకోండి. రోజూ కాకపోయినా.. వారంలో మూడుసార్లు అయినా జై బాదం అనండి.