Bajrang Punia | ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత నెల18న అతడు డోప్ టెస్టుకు మూత్ర నమూనాలు ఇవ్వలేదనే కారణంగా ఇదివరకే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా పునియాను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సస్పెండ్ చేసిం ది.
యూడబ్ల్యూడబ్ల్యూ నిర్ణయంతో పునియా పారిస్ ఒలింపిక్స్ కల ‘కలగానే’ మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గురువారం స్పోర్ట్స్ అథారిటీ (శాయ్) పునియా విదేశీ శిక్షణ నిమిత్తం రూ. 8.82 లక్షల అందజేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.