KL Rahul | లక్నో: లక్నోకు సారథి రాహుల్ గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. సంజీవ్ గొయెంకతో చాట్ అనంతరం రాహుల్ మనసు నొచ్చుకున్నాడని, ఈ సీజన్లో లక్నో ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్‌లకూ అతడు కెప్టెన్‌గా ఉండటం కష్టమేనని జట్టు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సీజన్లో లక్నో.. రాహుల్‌ను రిటైన్ కూడా చేసుకోదన్న వార్తలూ వినిపిస్తున్నాయి. 2022 సీజన్లో లక్నో.. రాహుల్‌ను రూ.17 కోట్లతో దక్కించుకుంది.