Model Schools | హైదరాబాద్ : రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్లో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో 40 సీట్ల చొప్పున సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నాలుగు కోర్సులు కూడా ఇంగ్లీష్ మీడియమే. దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం www.tsmodelschools.com అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.