Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సంతోషం వ్యక్తం చేసిన ఆప్ కార్యకర్తలు
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆప్ కార్యకర్తలు (AAP workers) సంతోషం వ్యక్తం చేశారు.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ (interim bail) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 1న కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆప్ కార్యకర్తలు (AAP workers) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆప్ కార్యాలయానికి చేరుకొని కేజ్రీవాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. సుప్రీం తీర్పును స్వాగతించారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణం వెనుక కీలక నిందితుడు ఆయనేనని, మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఈడీ ఆరోపించింది. ఇక అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
#WATCH | Delhi: AAP workers raise slogans in celebration outside party office, as Delhi CM Arvind Kejriwal gets interim bail till June 1. pic.twitter.com/1Nu1VMi3SF
— ANI (@ANI) May 10, 2024
Also Read..
Yamunotri Dham | తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు
Narendra Dabholkar | నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష
viral video | మద్యం మత్తులో ముగ్గురు యువతులు హల్చల్.. ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

