Ram Pothineni | ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ పోతినేని.?
Ram Pothineni | టాలీవుడ్ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టిన రామ్‌కి మళ్లీ సరైన హిట్ పడలేదు. ఈ మధ్య బోయపాటి డైరెక్షన్లో వచ్చిన స్కంద కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
Ram Pothineni | టాలీవుడ్ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టిన రామ్‌కి మళ్లీ సరైన హిట్ పడలేదు. ఈ మధ్య బోయపాటి డైరెక్షన్లో వచ్చిన స్కంద కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ముఖ్యంగా మూవీలోని కొన్ని సన్నివేశాలు అయితే మీమర్స్ పండగా చేసుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా చేస్తునే రామ్ ముందు జాగ్రత్తగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది.
నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి రామ్ పోతినేని ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ జోనర్లో రాబోతుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రామ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇందుకోసమే కొద్దిరోజుల క్రితం రామ్.. హరీష్ శంకర్‌ని కలిసి స్క్రిప్ట్ కూడా విన్నాడట. త్వరలోనే ఈ కాంబో కూడా ఓకే అయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

