Telangana | ‘ఆయనొక విప్లవం, అంతుచిక్కని పద్మవ్యూహం, తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను అలవోకగా చిత్తు చేసే చాణక్యుడు’ అని తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను కొనియాడుతారు. నిజమే కేసీఆర్ ఓ అం తుచిక్కని పద్మవ్యూహం. అతని ఎత్తులకు ఎం తటి ప్రత్యర్థి అయినా చిత్తు కావాల్సిందే. అం దుకే రాదనుకున్న ‘తెలంగాణ’ను తీసుకువచ్చి న ఘనత కేసీఆర్‌ది అని ప్రజలు ఇప్పటికీ కీర్తిస్తుంటారు. ఒక్క తెలంగాణ తేవడమే కాదు, తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెచ్చిన తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. యావత్ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. తెలంగాణను పచ్చని పంటల కల్పవల్లిగా మార్చారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల పునాదులపై తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో పాలన అటకెక్కింది. కేవలం కేసీఆర్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ పాలనలో విప్లవాత్మకంగా తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. అలవికాని హామీలను భుజాన వేసుకొని కొత్తగా సింహాసనమెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఊరూరా తిరుగుతూ బూతు పురాణం వల్లిస్తున్నారు. కాంగ్రెస్‌కు పర్యాయపదం కరువు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
గత బీఆర్ఎస్ పాలనలో ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. కనురెప్పవాల్చేంత సేపు కూడా కరెంటు పోయేది కాదు, కానీ ఇప్పుడు రోజులో నాలుగైదు సార్లు కరెంటు పోతున్నది. అందుకే అనవసరంగా కాంగ్రెస్‌కు ఓటు వేశామని ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుయాత్ర అనగానే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ, తెలంగాణ ప్రజల్లో మాత్రం ఒక భరోసా వచ్చింది. అందుకే ఆ ఉక్కు గుండెను తాకాలని బస్సుయాత్రకు ప్రజల తండోపతండాలుగా వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ చేయమని ప్రజలు బల్లగుద్ది చెప్తున్నారు.
అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలపాలని సవినయంగా మనవిజేస్తున్నా. రాష్ట్రంలో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ఓ విప్లవాన్ని సృష్టిస్తారనటంలో సందేహం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తమ ఓటుతో ఢిల్లీ గద్దెను బద్దలుకొట్టాలి.
– తెలంగాణ విజయ్ 94919 98702