క‌వ‌చం 'వ‌స్తావా పిల్లా' వీడియో సాంగ్

Wed,December 5, 2018 08:45 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ మామిళ్ళ తెర‌కెక్కించిన‌ చిత్రం ‘క‌వ‌చం’. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి వ‌స్తావా పిల్లా అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో కాజ‌ల్‌, మెహ‌రీన్‌లు గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుండగా, శ్రీనివాస్ త‌న డ్యాన్స్‌తో అద‌రగొడుతున్నాడు. సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా అందంగా ఉంది. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. చిత్రంలో హ‌ర్షవ‌ర్ధన్ రాణే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మించారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించారు.

1510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles