శుక్రవారం 07 ఆగస్టు 2020
Beauty-tips - Jan 31, 2020 , 23:40:25

మొటిమలకు టూత్‌పేస్ట్‌ మంచిదేనా?

మొటిమలకు టూత్‌పేస్ట్‌ మంచిదేనా?

కొందరు మొటిమలు తగ్గాలని ముఖానికి టూత్‌ పేస్ట్‌ పూస్తుంటారు. ఇంకొందరు ముఖ సౌందర్యం కోసం బేకింగ్‌ సోడా, ఉప్పు వాడుతుంటారు. అయితే వీటి వాడకంపై ఎన్నో అపోహలున్నాయి. ఇవి వాడితే నష్టమే అంటున్నారు వైద్యులు.

  • టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బోనేట్‌ ఉంటుంది. ఇది గోడలకు వేసే సున్నం, సిమెంట్‌ ప్లాస్టర్‌లో కూడా ఉంటుంది. అయితే మొటిమలపై పేస్ట్‌ రాస్తే అక్కడ చర్మాన్ని మరింత చికాకు పెడుతుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు.
  • చర్మంపై షుగర్‌, సాల్ట్‌, బేకింగ్‌ సోడా, చక్కెర వాడుతుంటారు. ఉప్పు, చక్కెర, బేకింగ్‌ పౌడర్‌ చిన్న స్ఫటికలతో కూడి ఉంటాయి. ఇవి ముఖంపై రుద్దినప్పుడు చర్మానికి సూక్ష్మ కోతల్ని కలిగిస్తాయి. వీటి ద్వారా బ్యాక్టీరియా, శిలీంద్రాలు చర్మంలోకి చేరే అవకాశం ఉంటుంది. ఇవి స్కిన్‌ అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
  •  హెయిర్‌ స్ప్రేలన్నీ రసాయనాలతో కూడుకున్నవే. స్ప్రేలోని ఆల్కహాల్‌ జుట్టును నిర్జీవం చేస్తుంది. జుట్టుకు స్ప్రే వాడకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
  • ముఖం శుభ్రంగా కనిపించాలని ఎన్నో రకాల ఫేస్‌ మాస్క్‌లు వేసుకుంటుంటారు. అయితే వీటిలో ఉండే జిగురు సైనోయాక్రిలేట్‌, ఇది చర్మంపై పొరను ఏర్పరుస్తుంది. దీన్ని ఎండిన తర్వాత ముఖంపై నుంచి లాగితే ముఖం మీద చిన్న సూక్ష్మ రాపిడి లేదా అంతర్లీన చర్మానికి కోతలు కలిగించి చికాకు పెడతాయని వైద్యులు చెబుతున్నారు.


logo