సోమవారం 01 మార్చి 2021
Zindagi - Feb 16, 2021 , 02:40:30

‘డేటింగ్‌'తో కోట్లకు కోట్లు!

‘డేటింగ్‌'తో కోట్లకు కోట్లు!

స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక.. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎంత చిన్నదంటే.. అరచేతిలో పట్టేటంత. ఆ అవకాశాన్నే వ్యాపారంగా మలుచుకున్నది అమెరికాకు చెందిన విట్నే ఓల్ఫ్‌. ‘బంబుల్‌' అనే డేటింగ్‌ యాప్‌ని ప్రారంభించి, కేవలం ఆరేండ్లలోనే ప్రపంచంలోనే యంగెస్ట్‌ లేడీ బిలియనీర్‌గా వార్తల్లో నిలిచింది 31ఏండ్ల విట్నే. టిండర్‌ డేటింగ్‌ యాప్‌ వ్యవస్థాపకుల్లో విట్నే ఒకరు. 2014లో బయటికొచ్చి సొంతంగా ‘బంబుల్‌'ను ప్రారంభించింది. మిగతా డేటింగ్‌ యాప్స్‌ కంటే ఇది వైవిధ్యమైంది. మహిళలు మాత్రమే ముందు మెసేజ్‌ చేయగల వెసులుబాటు దీనిలో ఉంది. సేఫ్టీ విషయంలో రాజీ ఉండదు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా  ఆదరించారు. కంపెనీ అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నాస్‌డాక్‌లో లిస్టయింది. తొలి రోజే  షేరు ధర 85 శాతం పెరిగింది. ఒక్క రోజులోనే కంపెనీ నికర విలువ 1400 కోట్ల డాలర్లకు చేరింది. దీంతో విట్నీ ఓల్ఫ్‌ ప్రపంచంలోని యువ బిలియనీర్స్‌ జాబితాలో చేరింది. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, టెన్నిస్‌ స్టార్‌ సెరినా విలియమ్స్‌ ఈ యాప్‌కు ప్రచారకర్తలు. VIDEOS

logo