Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Manne Krishank | హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రూ. 25 వేలతో కూడిన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మన్నె క్రిశాంక్‌ను మే 1వ తేదీన మధ్యాహ్నం చౌటుప్పల్ దగ్గర అరెస్టు చేశారు.
మన్నె క్రిశాంక్ అరెస్టు వివరాలు..
- ఏప్రిల్ 30న సాయంత్రం 4.45 గంటలకు క్రిశాంక్‌పై ఎఫ్ఐఆర్ నం.207/2024 నమోదైంది.
- ఐపీసీ 466, 468, 469, 505(1)(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- ఈ ఎఫ్ఐఆర్ను కేవలం గంటలోనే కోర్టుకు సమర్పించారు.
- మే నెల ఒకటిన మధ్యాహ్నం 12.30 గంటలకు చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్‌ప్లాజా వద్ద క్రిషాంక్‌ను అరెస్టు చేశారు.
- ఒకటవ తేదీన మళ్లీ ఐపీసీ 469, 465, 417, 471, 505(1)(బీ) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
- క్రిశాంక్‌పై నమోదు చేసిన అన్ని సెక్షన్లలోనూ శిక్ష ఏడేండ్లలోపే ఉంటుంది. ఇటువంటి కేసుల్లో.. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పోలీసులు 41ఏ సీఆర్పీసీని అనుసరించాలి. ఇందుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు జారీచేసిన సర్క్యూలర్‌లోని సూచనలను పాటించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.
- రిమాండ్ కేసు డైరీలో కే నాగేందర్‌ను రెండో నిందితుడిగా చేర్చారు.
- రిమాండ్ కేసు డైరీలో ‘ఇది రాజకీయ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో, మోసం చేసే ఉద్దేశంతో డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేశారు’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అది ఏ రాజకీయ పార్టీనో తెలుపలేదు.
బెయిల్ పిటిషన్ వివరాలు
- పోలీసుల రిమాండ్ విజ్ఞప్తిని తిరస్కరించాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ దాఖలు చేసిన మెమోను న్యాయమూర్తి అంగీకరించలేదు.
- పోలీసు రిమాండ్‌కు అనుమతిస్తూ కేసును 2వ తేదీకి వాయిదా వేశారు.
- 2వ తేదీన లంచ్ తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి ప్రాసిక్యూషన్ పాస్ ఓవర్ కోరింది.
- దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ‘వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోకూడదు’ అని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఏ2గా ఉన్న వ్యక్తికి 41ఏ సీఆర్పీసీని అనుసరించి నోటీసులు ఇవ్వాలని తెలిపింది.
- పీపీ కౌంటర్ దాఖలు చేయడానికి అనుమతిస్తూ.. కేసును 3వ తేదీకి వాయిదా వేసింది.
- 3వ తేదీన ప్రాసిక్యూషన్ 2 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేసింది.
- ఉత్తర్వుల కోసం న్యాయమూర్తి కేసును 4వ తేదీకి వాయిదా వేశారు.
- ఈ కేసులో 5వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 6వ తేదీ 11 గంటల వరకు ఒక రోజు కస్టడీ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
క్రిషాంక్ బెయిల్ పిటిషన్‌పై 9వ తేదీన 8వ ఏసీఎంఎం న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలను విని, తదుపరి విచారణ కోసం కేసును10వ తేదీకి వాయిదా వేశారు. మొత్తానికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

