GT vs CSK : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కీలక మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్లో నిరుడు రన్నరప్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఢీకొడుతోంది.
ఈ పోరులో టాస్ గెలిచిన సీఎస్కే సారథి బౌలింగ్ తీసుకున్నాడు. పరువు కోసం పోరాడుతున్న గుజరాత్ ఈ మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక చెన్నై సైతం స్టార్ బౌలర్లు ముస్తాఫిజుర్, పథిరన లేకుండా ఆడుతోంది.
చెన్నై తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవింద్ర, డారిల్ మిచెల్, శివం దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి.
నిరుడు ఫైనల్లో తలపడిన గుజరాత్, చెన్నై జట్లు.. ఈసారి టాప్లో నిలవలేకపోయాయి. ప్రస్తుతం సీఎస్కే నాలుగో స్థానంలో ఉండగా.. గుజరాత్ 8 పాయింట్లతో అట్టడుగున ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గైక్వాడ్ సేన గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. శుభ్మన్ గిల్ బృందం కనుక ఈ మ్యాచ్ ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగడం ఖాయం.