NKR21 Shooting Fire Attack | డెవిల్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ NKR21. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక క్రియేషన్స్‌కు ఇది రెండో సినిమా. అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి చాలారోజులు అయినప్పటికి బయటకు రాకపోవడం విశేషం. ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 4 కోట్లు ఖర్చుపెట్టి సెట్ వేయగా సగం షూటింగ్ అయిన అనంతరం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అవ్వగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది.