Colin Munro | న్యూజిలాండ్ చిచ్చరపిడుగు వీడ్కోలు.. కారణమిదే..!
Colin Munro : న్యూజిలాండ్ చిచ్చరపిడుగు కొలిన్ మున్రో(Colin Munro) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడంతో శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
Colin Munro : న్యూజిలాండ్ చిచ్చరపిడుగు కొలిన్ మున్రో(Colin Munro) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడంతో శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో, కివీస్ బోర్డు పెద్దలతో పాటు అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు. పొట్టి ఫార్మాట్లో రికార్డుల వీరుడుగా పేరొందిన మున్రో ఖాతలో మూడు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ కొట్టిన ఆరో క్రికెటర్ కూడా అతడే.
‘బ్యాక్క్యాప్స్ తరఫున ఆడడం నా క్రికెట్ కెరీర్లో చాలా గొప్ప విషయం. మూడు ఫార్మాట్లలో కలిపి 123 మ్యాచుల్లో న్యూజిలాండ్ జెర్సీ వేసుకున్నందుకు మరేమీ గర్వంతో పొంగిపోవడం లేదు. అయితే.. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కుతుందని ఆశించా. కానీ, నిరాశే మిగిలింది. అందునే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుతుకున్నా’ అని మున్రో తన సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.
News | Colin Munro has announced his retirement from international cricket, officially calling time on an international career that spanned 123 matches. #CricketNationhttps://t.co/zl6sSl3w3n
— BLACKCAPS (@BLACKCAPS) May 9, 2024
భారత్‌పై ఆఖరి మ్యాచ్
విధ్వంసక ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అయిన మున్రో న్యూజిలాండ్ తరఫున మొత్తం 123 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 65 టీ20లు, 57 వన్డేలు, ఒకే ఒక టెస్ట్ ఆడాడు. 37 ఏండ్ల మున్రో బ్యాక్ క్యాప్ జెర్సీతో 2020లో ఆఖరి టీ20 సిరీస్ ఆడాడు. అది కూడా భారత్‌పై ఆఖరి మ్యాచ్. ఈ నాలుగేండ్లలో మళ్లీ అతడు న్యూజిలాండ్ జెర్సీ వేసుకోలేదు. జాతీయ జట్టులో పోటీ పెరగడం, కుర్రాళ్లు దూసుకొస్తుండడంతో మున్రో ఇక కెరీర్‌కు వీడ్కోలు పలకాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇకపై అతడు ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నాడు.
కొలిన్ మున్రో సెంచరీ అభివాదం

టీ20 ఫార్మాట్లో సంచలనాలు సృష్టించిన మున్రో.. 156.4 స్ట్రయిక్‌రేటుతో 1,724 రన్స్ కొట్టాడు. దాంతో, పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. మైదానంలోకి దిగడమే ఆలస్యం అకాశమే హద్దుగా చెలరేగే మున్రో ఖాతాలో మూడు సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

