Thailand Open : భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty) మరో టైటిల్ ఖాతాలో వేసుకున్నారు. ఈ జోడీ థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం చైనా జంట చెన్ బొ యాంగ్, లీ యితో హోరాహోరీగా జరిగిన టైటిల్ పోరులో సాత్విజ్ ద్వయం గెలుపొందింది.
శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్ చిరాగ్‌లు 30 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించారు. చైనీస్ తైపీ ద్వయం మింగ్ చీ, టాఆంగ్ కివీను 21-11, 21-12తో ఓడించారు. ఫైనల్లోనూ సాత్విక్ జోడీ చాంపియన్ ఆటతో చెలరేగింది. వరుస సెట్లలో జోరు చూపించిన సాత్విక్ – చిరాగ్‌లు 21-15, 21-15తో చెన్, లీ జోడీని చిత్తు చేశారు. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్ ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకున్నారు.
SatChi won the Thailand Open and Reclaims their World No 1 Ranking in Men’s Doubles 🤩🇮🇳
The defeated 🇨🇳 Chen/Liu 21-15,21-15 in Thailand Open FINAL in straight games 💥🔥
Second Thailand Open title for Satwik & Chirag 🏆#BadmintonIndia #BWF #ThailandOpen pic.twitter.com/HwDnHFHtaD
— The Khel India (@TheKhelIndia) May 19, 2024