Venugumatla Teacher : నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి నిర్వహించిన జాతీయ సదస్సులో గొల్లపల్లి మండలంలోని వెనుగుమట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తిరుపతి (Tirupati) పాల్గొన్నారు. జీవశాస్త్రాన్ని బోధించే ఆయన మాట్లాడుతూ సైన్స్ ఉపాధ్యాయులను పరిశోధకులతో, కమ్యూనికేటర్లతో, నిపుణులతో సమ్మిళితం చేసి సైన్స్‌ను ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సు జరిగినట్లు తెలిపారు.
‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర – వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.