Wanaparthy : వనపర్తి జిల్లాలో పౌరసరఫరాల మేనేజర్ జగన్ మోహన్ (Jaganmohan) అవినీతి నిరోధక అధికారులకు చిక్కాడు. గురువారం అతడు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వనపర్తిలోని ఒక రైస్ మిల్లర్‌కు సీఎంఆర్ అనుమతి ఇచ్చేందుకు జగన్మోహన్ తిప్పించకున్నాడు.
చివరకు ‘లంచం ఇస్తేనే పని జరుగుతంద’ని అతడితో చెప్పాడు. దాంతో.. సదరు రైస్ మిల్లర్ ఏమీ తోచక ఏసీబీని ఆశ్రయించాడు. అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ను వారు వలపన్ని పట్టుకున్నారు. రైస్ మిల్లర్ నుంచి అతడు అర లక్ష లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.