భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడి కాళ్లకు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే నమస్కరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ, సామాజిక విమర్శలకు దారితీసింది. (BJP Leader Touches Jyotiraditya Son’s Feet) జనవరి 5న మధ్యప్రదేశ్ శివపురి జిల్లా స్టేడియంలో 69వ జాతీయ పాఠశాలల క్రీడల పోటీలు జరిగాయి. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కుమారుడైన 31 ఏళ్ల మహార్యమన్ సింధియాతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, బీజేపీ సీనియర్ నేత, శివపురి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన 73 ఏళ్ల దేవేంద్ర కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజున ఆయన పుట్టిన రోజు కావడంతో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న జ్యోతిరాదిత్య కుమారుడైన మహార్యమన్ సింధియా కాళ్లకు వృద్ధుడైన ఆ నేత నమస్కరించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ, సామాజిక పరంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దేవేంద్ర కుమార్ జైన్ తన చర్యను సమర్థించుకున్నారు. వయస్సులో చిన్నవాడైనప్పటికీ గౌరవంతో అతడి కాళ్లకు నమస్కరించడంలో తప్పేమీ లేదన్నారు.
Also Read:
Suresh Pasi | ‘ముస్లింల ఓట్లు అవసరం లేదు’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Best City for Women | 2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్ సిటీ ఇదే
Man Makes Electric Jeep | లక్ష వ్యయంతో.. ఎలక్ట్రిక్ జీప్ తయారు చేసిన వ్యక్తి