Jagityal : జగిత్యాల జిల్లా దివ్యాంగుల నూతన కమిటీ అధ్యక్షుడిగా లంక దాసరి శ్రీనివాస్ (Lanka Dasari Srinivas) ఎంపికయ్యారు. గురువారం జిల్లాలోని సీనియర్ దివ్యాంగ నాయకుల సమక్షంలో కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. భవిష్యత్తు ప్రణాళిక కార్య నిర్వహణ కోసం, హక్కుల సాధన గురించి అధ్యక్ష, ఉపాధ్యక్ష నియోజకవర్గ, మండల స్థాయి కార్యవర్గం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేకుండా పారదర్శకంగా కమిటీ ఎన్నిక నిర్వహించామని దివ్యాంగ నాయకులు తెలిపారు.
దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడిగా లంక దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా అస్గర్ మహమ్మద్ ఖాన్, మేక అంజయ్య, ముత్తు మహేష్, ఎడిపెల్లి శ్రీనివాస్, మాసం నరసయ్య, ఎండి ఆఫీజా, బూతగడ్డ అంజన్నలు ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా బొలిశెట్టి రాజేష్, అన్నపు రాజేందర్, కోశాధికారిగా గొల్లపల్లి శ్రీధర్ పెగడపల్లి, సంయుక్త కార్యదర్శులుగా మడిశెట్టి రాజు, పోచమ్మ లలిత.. గౌరవ సలహాదారులుగా గుడిసెల గంగాధర్ ( సర్పంచ్) గౌరిశెట్టి చంద్రశేఖర్ ఎంపికయ్యారు. నూతన కమిటీ ఎన్నికలో దాదాపు 90 నుండి 120 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.