BCCI : పొట్టి ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న తిలక్ వర్మ తిలక్ వర్మ (Tilak Varma) గురించి అభిమానుల్లో నెలకొన్న ఆందోళనే నిజమైంది. బుధవారం రాజ్‌కోట్‌లో సర్జరీ చేయించుకున్న ఈ చిచ్చరపిడుగు స్వదేశంలో న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. తిలక్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ.. కివీస్‌తో జరుగబోయే పొట్టి సిరీస్‌లో మొదటి మూడు టీ20లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.
‘సర్జరీ చేయించుకున్న తిలక్ వర్మ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్తాడు. ప్రస్తుతానికి తిలక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. పూర్తిగా కోలుకున్నాక అతడు ప్రాక్టీస్, నైపుణ్యాన్ని మెరుగుపరిచే పనులు మొదలుపెడతాడు. కాబట్టి.. న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడు. త్వరగా కోలుకొని ఫిట్‌గా ఉంటే చివరి రెండు మ్యాచుల్లో (జనవరి 28న వైజాగ్‌లో, జనవరి 31న త్రివేండ్రంలో) ఆడే అవకాశముంది’ అని బీసీసీఐ పేర్కొంది.
🚨 NEWS 🚨
Tilak Varma ruled out of the first three T20Is against New Zealand.
His availability for the remaining two matches will be assessed based on his progress during the return-to-training and skill phases.
Details 🔽 | #TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank…
— BCCI (@BCCI) January 8, 2026
నిరుడు ఆసియా కప్ ఫైనల్లో ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించిన అనూహ్యంగా గాయడడంతో సర్జరీ తప్పలేదు. రాజ్‌కోట్‌లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడ్డాడు. దాంతో, అతడికి ‘టెస్టిక్యులర్ టార్సన్’ సర్జరీ చేశారు వైద్యులు. అయితే.. ఈ తెలుగు కుర్రాడు కోలుకునేది ఎప్పుడు? ప్రపంచకప్ టోర్నీలో ఆడతాడా? అని సందేహాలు వెలిబుచ్చారు అభిమానులు. కానీ, హైదరాబాద్ క్రికెట్ టీమ్ కోచ్ డీబీ రవి తేజ (Ravi Teja) మాత్రం తిలక్ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని, అతడు త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడుతాడని అన్నాడు.
‘రాజ్‌కోట్‌లో బుధవారం తిలక్ వర్మకు మైనర్ సర్జరీ అయింది. అతడి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదు. మూడు, నాలుగు రోజుల్లో అతడు కోలుకుంటాడు. జనవరి 8న జమ్ము కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడతాడు. ఈరోజు కూడా ఆడేందుకు తిలక్ సిద్ధంగా ఉన్నాడు. అయితే.. నాకౌట్‌కు హైదరాబాద్ అర్హత సాధించే అవకాశాలు లేనందున అతడిని ఆడించి రిస్క్ తీసుకోవడం సరి కాదనిపించింది’ అని రవి తేజ వెల్లడించాడు. కానీ, బీసీసీఐ మాత్రం తిలక్ ఆరోగ్యంపై అప్డేట్ ఇస్తూ అతడు న్యూజిలాండ్‌తో మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడని చెప్పేసింది. దాంతో.. అభిమానులు షాక్ తిన్నారు.