PJTSAU : జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ(Question Papers Leakage) కలకలం రేపింది. సెమిస్టర్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు యూనివర్సిటీ అధికారులు. అంతేకాదు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్దుల ప్రవేశాలను సైతం రద్దు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.
ఇటీవల కాలంలో సెమిస్టర్ ప్రశ్నపత్రాలు లీవ్ అవుతున్నట్టు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు గమనించారు. వర్సిటీ సిబ్బంది సాయంతో సెమిస్టర్ ప్రశ్నపత్రాలను కొందరు పొందారని, 2025- 26 థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు వాట్సప్‌తో ఇలతర వ్యవసాయ కళాశాలల విద్యార్ధులకు పంపినట్టు నిర్ధరణకు వచ్చారు. దాంతో, ఇన్సర్వీసెస్ కోటాలో చేరిన 35 ఏఈవోల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్టు యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది.