ముంబై: నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ (70) శుక్రవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. ‘ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఆయన సుప్రసిద్ధులు. రఘునందన్ కర్ణాటకలోని మంగళూరులో ఓ గ్రామంలో జన్మించారు.
1982లో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. నేచురల్స్ను 1984లో స్థాపించారు. జుహులోని కొలివాడలో 200 చదరపు అడుగుల స్థలంలో ప్రారంభమైన ఆయన వ్యాపారం నేడు ఏటా రూ.300 కోట్ల టర్నోవర్ జరుగుతున్నది.