RR vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఎట్టకేలకు మరికాసేపట్లో షురూ కానుంది. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడి ఉండడంతో 10: 30కు టాస్ వేశారు. ఏడు ఓవర్లకు కుదించిన పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) సారథి శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు ఎంతో కీలకం. ఎందుకంటే.. మరో రెండు పాయింట్లు సాధిస్తే సంజూ సేన క్వాలిఫయర్ ఆడుతోంది.
🚨 Toss Update 🚨
Kolkata Knight Riders elect to bowl against Rajasthan Royals.
7️⃣ overs a side ‼️
Follow the Match ▶️ https://t.co/Hid26cGWlQ#TATAIPL | #RRvKKR pic.twitter.com/Jvc8Mc5PQr
— IndianPremierLeague (@IPL) May 19, 2024
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, టామ్ కొహ్లెర్ కడ్మోర్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్, నంద్రే బర్గర్.
కోల్‌కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, అంకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.