Number Plate | రంగు రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఏ వాహనానికి ఏ కలర్ ప్లేట్ ఇస్తారో తెలుసా?
Number Plate | మనచుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతుంటాయి. వాటి నంబర్ ప్లేట్లు విభిన్న రకాలుగా దర్శనమిస్తాయి. వాటిని నిరంతరం చూస్తాం. కానీ వాటి వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాదు? నంబర్ ప్లేట్లు ఎన్ని రకాలు? వాటి కలర్స్ ఏ విధంగా ఉంటాయి?
Number Plate | మనచుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతుంటాయి. వాటి నంబర్ ప్లేట్లు విభిన్న రకాలుగా దర్శనమిస్తాయి. వాటిని నిరంతరం చూస్తాం. కానీ వాటి వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాదు? నంబర్ ప్లేట్లు ఎన్ని రకాలు? వాటి కలర్స్ ఏ విధంగా ఉంటాయి? రంగురంగుల ప్లేట్లపై నంబర్లు మరో రంగులో దర్శనమిస్తే వేటికి సంకేతం? అవి వేటిని సూచిస్తాయి? ఎలాంటి సేవలకు ఎలాంటి నంబర్ ప్లేట్‌ను అమర్చుతారు? తదితర విషయాలపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. కొంతమంది నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను కిరాయిలకు కేటాయించి ఆర్టీఏ అధికారులకు బుక్ అవుతుంటారు. అలాంటి వాహనాలను అధికారులు నంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తిస్తారు. నంబర్ ప్లేట్ చూడగానే 90శాతం ఆ బండి ఏ సర్వీస్‌కు కేటాయించిందో అధికారులకు తెలిసిపోతుంది. అలాంటి నంబర్ ప్లేట్ వాహనాల సమాచారం మీకోసం.
ఏ రంగు దేనికంటే..
సాధారణంగా 7రకాల నంబర్ ప్లేట్స్ అందుబాటులో ఉంటాయి. ఒక్కో కేటగిరి సేవలకు ఒక్కో నంబర్ ప్లేట్‌ను వినియోగిస్తారు. సేవల ఆధారంగా వాటికి కలర్స్ కేటాయిస్తారు.

వైట్‌ప్లేట్‌పై బ్లాక్ కలర్లో నంబర్ ఉంటే అది నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్‌ను సూచిస్తుంది. సొంత వాహనాలకు ఈ తరహా నంబర్ ప్లేట్‌ను కేటాయిస్తారు. కొంతమంది వైట్ ప్లేట్ వాహనాలను యెల్లో బోర్డు వాహనాల వలే కిరాయిలు కొడుతుంటారు. ఈ తరహా వాహనాలపై ఆర్టీఏ దృష్టి సారించింది.

యెల్లో ప్లేట్‌పై బ్లాక్ నంబర్ ఉంటే అవి ట్రాన్స్పోర్ట్ వాహనాలని సంకేతం. కమర్షియల్ అవసరాలకు ఈ తరహా బండ్లను ఉపయోగించుకోవచ్చు. గూడ్స్ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనాలని అర్థం.

బ్లాక్ప్లేట్పై యెల్లో కలర్ నంబర్ ఉంటే ఆ వాహనాలు అద్దె సర్వీస్‌కు అనుమతించబడినట్టు. అంటే ఆ వాహనాలను ఓనర్ రెంటెడ్ బేస్ మీద అద్దెకు ఇవ్వొచ్చు. చాలా మంది రెంటల్స్ సర్వీస్ అందిస్తారు. అయితే ఈ తరహా వాహనాలు కాకుండా ఇతర వాహనాలను అద్దెకు ఇస్తే ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తారు.

గ్రీన్ బోర్డుపై వైట్ కలర్లో నంబర్ ఉంటే ఆ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలని సంకేతం.

యెల్లో ప్లేట్‌పై రెడ్ కలర్లో నంబర్ ఉంటే ట్రేడ్ సర్టిఫికెట్ కల్గిన వాహనాలని అర్థం. అంటే కొత్త వాహనాలను విక్రయించడానికి ఏర్పాటు చేసే ఎక్స్పోలకు ఆ వాహనాలను తరలించేందుకు ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను ఉపయోగిస్తారు.

బ్లూ ప్లేట్‌పై వైట్ కలర్లో నంబర్ ఉంటే ఆ వాహనాలు కాన్సులేట్ కార్యాలయ వాహనాలని సంకేతం.

గ్రీన్ ప్లేట్‌పై యెల్లో నంబర్ ఉంటే అవి ఎలక్ట్రిక్ వాహనాలు. ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ పర్పస్‌గా వినియోగించుకోవచ్చని అర్థం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Number Plate
- RTA
- TG
- TS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

