Brahmotsavam | మే 21 నుంచి ఉత్తరాఖండ్ రిషికేష్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
Brahmotsavam | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
తిరుపతి : ఉత్తరాఖండ్ (Uttarakhand ) రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 20సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తామని వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,508 మంది భక్తులు దర్శించుకోగా 25,996 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

