Pawan Kalyan | జనసేనానికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ మద్దతు
AP Assembly Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటిచేస్తుండడంతో సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
AP Assembly Elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటిచేస్తుండడంతో సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా జనసేనానికి తన మద్దతు ప్రకటించింది. ఎక్స్ వేదికగా మద్దతు తెలుపుతూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆకాంక్షించింది. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించిన అసోసియేషన్ డైరీని పవన్ కల్యాణ్‌కు అసోసియేషన్ సభ్యులు అందించారు. ఇక ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రఘు, శ్రీనివాస్ (ఎస్ కె ఎన్), సురేంద్ర కే నాయుడు తదితరులు పాల్గోన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ను మర్యాద పూర్వకంగా పిఠాపురంలో కలసి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరఫున తమ సంఘీభావాన్ని తెలిపిన #TFJA అసోసియేషన్ సభ్యులు శ్రీ రఘు, శ్రీ శ్రీనివాస్ (ఎస్ కె ఎన్), శ్రీ సురేంద్ర కే నాయుడు. రానున్న ఎన్నికల్లో పిఠాపురంలో భారీ… pic.twitter.com/3WcbkrlZr7
— Telugu Film Journalists Association (@FilmJournalists) May 10, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

